హైకోర్టును ఆశ్రయించిన కేసీఆర్
జస్టిస్ నర్సింహారెడ్డి కమిషన్ పై
హైదరాబాద్ – బీఆర్ఎస్ బాస్, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. మంగళవారం ఆయన హైకోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం రాష్ట్రంలో కొలువు తీరిన కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. పనిగట్టుకుని కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారంటూ మండిపడ్డారు. అయినా తనను పీఎం మోడీ, సీఎం రేవంత్ రెడ్డి ఏమీ చేయలేరంటూ హెచ్చరించారు.
ఆగమై పోయిన తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి అనే పట్టాలు ఎక్కించిన ఘనత తనదేనని పేర్కొన్నారు. ఈ తరుణంలో 24 గంటల పాటు విద్యుత్ ఇచ్చిన తమ సర్కార్ దేనంటూ స్పష్టం చేశారు కేసీఆర్. ఇదిలా ఉండగా సీఎం రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. విద్యుత్ సరఫరాలో అడ్డగోలుగా అక్రమాలు చోటు చేసుకున్నాయంటూ వీటిపై విచారణకు ఆదేశించారు.
ఈ మేరకు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ నరసింహారెడ్డిని చైర్మన్ గా నియమించారు. దీనిపై అభ్యంతరం తెలియ చేస్తూ హైకోర్టు మెట్లు ఎక్కారు మాజీ సీఎం కేసీఆర్. నిబంధనల మేరకే తాను విద్యుత్ ను కొనుగోలు చేయడం జరిగిందని చెప్పారు.