నియమించిన మాజీ సీఎం కేసీఆర్
హైదరాబాద్ – బీఆర్ఎస్ పార్టీ చీఫ్ కేసీఆర్ కీలక ప్రకటన చేశారు. తమ పార్టీకి సంబంధించి శాసన సభ , శాసన మండలిలో ఎమ్మెల్యే వివేకానంద్ , ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ లను పార్టీ విప్ లుగా నియమించారు. ఈ మేరకు పార్టీ అధికారికంగా వెల్లడించింది. ప్రజల తరపున తమ గొంతు వినిపించాలని, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని ఈ సందర్బంగా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు హిత బోధ చేశారు.
అడ్డగోలు హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అమలు చేయలేక పోతోందని, ఇప్పటికే ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేక మొదలైందన్నారు. తాజాగా శాసన సభలో సర్కార్ ప్రవేశ పెట్టిన సమగ్ర కుటుంబ సర్వే పై అన్ని వర్గాలు అసంతృప్తిని వ్యక్తం చేశాయని, దీనిపై కూడా మన స్టాండ్ ఏమిటనేది తెలియ చేసేందుకు ప్రయత్నం చేయాలని ఆదేశించారు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలను.
ఇదిలా ఉండగా గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా కీలకమైన బాధ్యతలు నిర్వహించారు సత్యవతి రాథోడ్. ఇక వివేకానంద్ సైతం ప్రజల మధ్యనే ఉండేందుకు ప్రయత్నించారు. తమను విప్ లుగా నియమించినందుకు ధన్యవాదాలు తెలిపారు పార్టీ బాస్, మాజీ సీఎం కేసీఆర్ కు.