Wednesday, April 2, 2025
HomeNEWSINTERNATIONALఘనంగా కేసీఆర్‌ జన్మదిన వేడుకలు

ఘనంగా కేసీఆర్‌ జన్మదిన వేడుకలు

స‌తీష్ కుమార్ ఆధ్వ‌ర్యంలో కేకే్ క‌ట్

బ‌హ్రెయిన్ – బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ పుట్టిన రోజును ఘ‌నంగా నిర్వ‌హించారు బీఆర్ఎస్ ఆధ్వ‌ర్యంలో బ‌హ్రెయిన్ లో. ఎన్నారై రాధార‌పు స‌తీష్ కుమార్ అధ్య‌క్ష‌త‌న కేకు క‌ట్ చేశారు. ఉద్య‌మ స‌మ‌యంలో కేసీఆర్ వెంట ఉన్నామ‌ని, ఇప్పుడు కూడా ఆయ‌న చూపిన దారిలోనే న‌డుస్తామ‌న్నారు. అరవై ఏళ్ల స్వరాష్ట్ర కలను సాకారం చేసి, తొమ్మిదిన్నర యేండ్ల పాలనలో తెలంగాణను దేశానికే ఆదర్శంగా నిలిపిన ఘనత కేసీఆర్‌కు దక్కిందని పేర్కొన్నారు.

అభివృద్ధి, సంక్షేమాలకు చిరునామాగా నిలిచిన కేసీఆర్‌ ఆయురారోగ్యాలతో కలకాలం ఉండాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల్లో మాట ఇవ్వక పోయినా నిరుపేద జీవితాల్లో సంక్షేమ వెలుగులు నింపి రైతుబంధు, రుణమాఫీ కోసం రైతుల ఖాతాల్లో రూ. లక్ష కోట్లు వేసిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిద‌న్నారు.

అధికారం అంటే పేదల జీవితాలు మార్చేందుకు వచ్చిన అవకాశం అని నిరూపించిన ఏకైక నాయకుడు కేసీఆర్ అని కొనియాడారు. ప్రజాపాలన అంటే నిర్బంధాల పాలన అయిందని ఆరోపించారు. పాలన చేతగాక, కేవలం ప్రజల దృష్టి మార్చేందుకు బీఆర్‌ఎస్‌ నాయకులపై అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు.

ఓవైపు తెలంగాణలో కాంగ్రెస్‌ గ్యారెంటీలను అమలు చేయాలని ప్రజలు రోడ్డెక్కుతుంటే మరోవైపు రాష్ట్రంలో ఆరు గ్యారెంటీలను అమలు చేశామని రేవంత్‌రెడ్డి మాట్లాడుతుండ‌డం విడ్డూరంగా ఉంద‌న్నారు. దేశంలో ఏ సీఎం కూడా వారానికోసారి ఢిల్లీ వెళ్లినట్టు చరిత్రలో లేదన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments