ఏపీ జనం జగన్ కే పట్టం – కేసీఆర్
మీడియాతో బీఆర్ఎస్ ప్రెసిడెంట్
హైదరాబాద్ – బీఆర్ఎస్ బాస్ , తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కీలక వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రస్తుతం జరగబోయే ఎన్నికలపై స్పందించారు. ఆయన శుక్రవారం ఓ మీడియా ఛానల్ తో సంభాషించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బస్సు యాత్ర చేపట్టిన కేసీఆర్ ఏపీలో ఎన్నికల ఫలితాలపై ముందస్తు ప్రకటన చేశారు.
ఆయన ముందు నుంచీ ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డితో సఖ్యతను పాటిస్తూ వచ్చారు. ఒక రకంగా ఇద్దరూ ఇచ్చి పుచ్చుకునే ధోరణితో వ్యవహరించారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు జరుగుతుండగా ఏపీలో ఇటు శాసన సభ అటు లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నాయి.
గతంలో ఎన్నడూ లేని రీతిలో ఏపీలో సంకుల సమరం కొనసాగుతోంది. జగన్ రెడ్డి ఓ వైపు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి మరో వైపు, కాంగ్రెస్ ఇంకో వైపు పోరాటం చేస్తున్నాయి. ఈ తరుణంలో జాతీయ మీడియా, సర్వే సంస్థలన్నీ గంప గుత్తగా జగన్ రెడ్డికి ఎదురు గాలి వీస్తోందంటూ పేర్కొంటున్నాయి.
కానీ అనూహ్యంగా కేసీఆర్ మాత్రం అదేమీ లేదని, అదంతా దుష్ప్రచారం అని కొట్టి పారేశారు. జగన్ మోహన్ రెడ్డి మరోసారి సీఎం కాబోతున్నాడని, స్పష్టమైన మెజారిటీ రావడం ఖాయమని జోష్యం చెప్పారు.
నాకున్న సమాచారం మేరకు ఆంధ్రప్రదేశ్‌లో రెండోసారి జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతున్నాడు – కేసీఆర్