NEWSTELANGANA

కేసీఆర్ బ‌స్సు యాత్ర

Share it with your family & friends

18న బీ ఫారంలు అంద‌జేత‌

హైద‌రాబాద్ – పార్ల‌మెంట్ ఎన్నిక‌ల‌కు సంబంధించి మాజీ సీఎం , బీఆర్ఎస్ పార్టీ చీఫ్ కేసీఆర్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. ఈ మేర‌కు ఏప్రిల్ 18న అభ్య‌ర్థుల‌కు పార్టీ బాస్ కేసీఆర్ బీ ఫాంలు అంద‌జేయ‌నున్నారు. పార్టీ ప్ర‌క‌టించింది ఈ విష‌యాన్ని .

అంతే కాకుండా రాష్ట్రంలో ప్ర‌స్తుతం రైతులు అరిగోస ప‌డుతున్నారు. వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఏమిట‌నే దానిపై తెలుసుకునే ప్ర‌య‌త్నం చేయ‌నున్నారు కేసీఆర్. ఇందుకు గాను ఆయ‌న బ‌స్సు యాత్ర చేప‌ట్ట‌నున్న‌ట్లు స‌మాచారం.

అన్న‌దాత‌ల‌ను క‌లుసుకుని వారికి క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర క‌ల్పించేలా భ‌రోసా ఇవ్వ‌నున్నారు. రాష్ట్ర‌మంత‌టా బ‌స్సు యాత్ర‌లు నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు బీఆర్ఎస్ పార్టీ వెల్ల‌డించింది. ఈ మేర‌కు కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది.

ఇదిలా ఉండ‌గా 18న జ‌రిగే పార్టీ కీల‌క స‌మావేశంలో కేసీఆర్ బ‌స్సు యాత్ర‌కు సంబంధించి రూట్ మ్యాప్ పై చ‌ర్చించి తుది నిర్ణ‌యం తీసుకుంటార‌ని పేర్కొంది. ఇదిలా ఉండ‌గా కేసీఆర్ గ‌త కొంత కాలంగా కాంగ్రెస్ పార్టీపై, సీఎం రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరుగుతూ వ‌స్తున్నారు.

పాల‌నా ప‌రంగా పూర్తిగా విఫ‌లం అయ్యాడంటూ మండిప‌డ్డారు. మొత్తంగా కేసీఆర్ మ‌రోసారి త‌న ప్ర‌తాపాన్ని చూప‌నున్నారు.