సార్వత్రిక ఎన్నికల్లో రోడ్ షోలకు శ్రీకారం
హైదరాబాద్ – సార్వత్రిక ఎన్నికల్లో సత్తా చాటేందుకు కాంగ్రెస్, బీజేపీపై సమర భేరి మోగించేందుకు సిద్దమయ్యారు బీఆర్ఎస్ బాస్, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్. ఈ సందర్బంగా ప్రజలతో కలిసేందుకు ఆయన రోడ్ షోలు చేపట్టనున్నారు.
కేసీఆర్ యాత్ర ఏప్రిల్ 24 నుంచి ప్రారంభం కానుందని భారత రాష్ట్ర సమితి పార్టీ ఆదివారం కీలక ప్రకటన చేసింది. ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. మిర్యాల గూడ లో సాయంత్రం 5.30 గంటలకు రోడ్ షో చేపడతారు. అనంతరం రాత్రి 7 గంటలకు సూర్యాపేటలో ప్రచారం చేపడతారని తెలిపింది.
25న భువనగిరిలో సాయంత్రం 6 గంటలకు రోడ్ షో చేపడతారని , ఎర్రవల్లిలో బస చేస్తారని పేర్కొంది. 26న మహబూబ్ నగర్ లో సాయంత్రం రోడ్ షో నిర్వహిస్తారని, ఇక్కడే రాత్రి ఉంటారని తెలిపింది బీఆర్ఎస్.
27న సాయంత్రం 6 గంటలకు నాగర్ కర్నూల్ లో రోడ్ షో చేపడతారు. 28న వరంగల్ లో రోడ్ షో నిర్వహిస్తారు. అదే రోజు ఇక్కడే బస చేస్తారు. 29న ఖమ్మంలో సాయంత్రం రోడ్ షో చేపడతారు. ఇక్కడే బస చేస్తారు.
30న సాయంత్రం 5.30 గంటలకు తల్లాడలో కేసీఆర్ రోడ్ షో ఉంటుంది. 6.30 గంటలకు కొత్తగూడెంలో ప్రచారం చేపడతారు. ఇక్కడే రాత్రి ఉంటారు. మే1న మహబూబాద్ లో సాయంత్రం 6 గంటలకు రోడ్ షో ఉంటుంది. వరంగల్ లో రాత్రి బస చేస్తారు కేసీఆర్.
మే 2న జమ్మికుంటలో సాయంత్రం 6 గంటలకు రోడ్ షో నిర్వహిస్తారు. వీణవంకలో రాత్రి బస చేస్తారు. 3న రామగుండలో ప్రచారం చేపడతారు. అక్కడే రాత్రి ఉంటారు. 4న మంచిర్యాలలో రోడ్ షో ఉంటుంది. కరీంనగర్ లో బస చేస్తారు.
మే 5న జగిత్యాలలో రోడ్ షో లో పాల్గొంటారు. జగిత్యాలలో బస చేస్తారు. 6న నిజామాబాద్ లో రోడ్ షో లో పాల్గొంటారు. అక్కడే రాత్రి బస చేస్తారు. 7న కామారెడ్డిలో రోడ్ షో లో సాయంత్రం 5.30 గంటలకు పాల్గొంటారు. మెదక్ లో రాత్రి 7 గంటలకు రోడ్ షోలో పాల్గొంటారు.
మే 8న సాయంత్రం 5.30 గంటలకు నర్సాపూర్ రోడ్ షోలో పాల్గొంటారు. అక్కడి నుంచి పటాన్ చెరువు లో రోడ్ షోలో పాల్గొంటారు కేసీఆర్. ఎర్రవెల్లిలో రాత్రి బస చేస్తారు.