NEWSTELANGANA

దాతృత్వానికి ద‌ర్ప‌ణం బ‌క్రీద్

Share it with your family & friends

ముస్లింల‌కు కేసీఆర్ శుభాకాంక్ష‌లు

హైద‌రాబాద్ – బక్రీద్ ప‌ర్వ‌దినం సందర్భంగా బీఆర్ఎస్ అధినేత , తెలంగాణ తొలి ముఖ్య‌మంత్రి కేసీఆర్ ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. సోమ‌వారం ఆయ‌న ట్విట్ట‌ర్ ఎక్స్ వేదిక‌గా స్పందించారు.

దైవాజ్ఞను అనుసరించి సమాజ హితం కోరి ప్రతీ మానవుడు నిస్వార్థ సేవలను అందించాలనే సందేశం బక్రీద్ మనకు అందిస్తుందని కేసీఆర్ తెలిపారు.

తమకు కలిగిన దాంట్లోంచి ఎంతో కొంత ఇతరులకు పంచడమనే దాతృత్వ స్వభావాన్ని బక్రీద్ పండుగ ద్వారా నేర్చుకోవాలని అన్నారు.

స్వార్థం, అసూయ, రాగ ద్వేషాలను విడిచిపెట్టి మానవుల్లో త్యాగ నిరతిని వ్యాపింప చేయడమే బక్రీద్ పండుగ ముఖ్యఉద్దేశం అని పేర్కొన్నారు కేసీఆర్.

అన్ని గుణాల కన్నా దానగుణమే ఉత్తమం అన్నది బక్రీద్ సారాంశమని, పండుగ సందర్భంగా ఖుర్బానీ ద్వారా పేదలకు ఆహారం వితరణగా ఇస్తారన్నార‌ని పేర్కొన్నారు. హజ్రత్ ఇబ్రహీం త్యాగ నిరతిని స్మరించుకుంటూ బక్రీద్ పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్న ముస్లిం సోదర సోదరీమణులు అందరికీ శుభాకాంక్షలు తెలిపారు.