NEWSTELANGANA

రామోజీ మ‌ర‌ణం బాధాక‌రం

Share it with your family & friends

మాజీ సీఎం కేసీఆర్ సంతాపం

హైద‌రాబాద్ – ఈనాడు సంస్థ‌ల చైర్మ‌న్ చెరుకూరి రామోజీ రావు మృతి ప‌ట్ల తీవ్ర సంతాపం వ్య‌క్తం చేశారు తెలంగాణ తొలి ముఖ్య‌మంత్రి కేసీఆర్. శ‌నివారం ఆయ‌న కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ట్విట్ట‌ర్ వేదిక‌గా రామోజీరావుతో త‌న‌కు ఉన్న బంధాన్ని గుర్తు చేసుకున్నారు.

మీడియా సంస్థ‌ల అధిప‌తిగా , ఇత‌ర వ్యాపార‌, వాణిజ్య సంస్థ‌ల చీఫ్ గా రామోజీరావు సాగించిన ప్ర‌స్థానం గురించి ఎంత చెప్పినా త‌క్కువేన‌ని పేర్కొన్నారు కేసీఆర్. అక్ష‌రాల‌కు శ‌క్తి ఉంద‌ని నిరూపించాడ‌ని, ఈనాడు ప‌త్రిక ద్వారా సంచ‌ల‌నం సృష్టించార‌ని గుర్తు చేశారు .

రామోజీరావు ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని, వారి కుటుంబానికి ప్ర‌గాఢ సానుభూతిని తెలియ చేశారు కేసీఆర్. ఇదిలా ఉండ‌గా శుక్ర‌వారం అస్వ‌స్థ‌త‌కు గురైన రామోజీరావును ఆస్ప‌త్రికి త‌ర‌లించ‌గా శ‌నివారం తెల్ల‌వారుజామున 4.15 గంట‌ల‌కు తుది శ్వాస విడిచాచారు.

చెరుకూరి మృతి చెంద‌డం ప‌ట్ల పీఎం మోడీ, మాజీ ఉప రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య నాయుడు, సీఎం మాజీ సీఎంలు రేవంత్ రెడ్డి, చంద్ర‌బాబు నాయుడు, ప్ర‌ముఖ న‌టులు చిరంజీవి, ప‌వ‌న్ క‌ళ్యాణ్ , రాజేంద్ర ప్ర‌సాద్, ద‌ర్శ‌కులు శంక‌ర్, రాజ‌మౌళి నివాళులు అర్పించారు.