ప్రధాని రేసులో నేనున్నా
మాజీ సీఎం కేసీఆర్ కామెంట్
హైదరాబాద్ – బీఆర్ఎస్ బాస్ , తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన సమకాలీన రాజకీయాలపై స్పందించారు. జాతీయ ఛానెల్ తో సంభాషించారు. ఈ సందర్బంగా ప్రముఖ జర్నలిస్ట్ నబీలా జమాల్ అడిగిన ప్రశ్నకు షాకింగ్ ఆన్సర్ ఇచ్చారు.
సార్వత్రిక ఎన్నికల్లో జాతీయ పార్టీలకు భవిష్యత్తు లేదన్నారు. బీజేపీకి కనీసం 200 సీట్లు కూడా రావన్నారు. 543 సీట్లలో ప్రాంతీయ పార్టీలే కీలకమైన పాత్ర పోషిస్తాయని ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు కేసీఆర్. మొత్తం 17 సీట్లకు గాను బీఆర్ఎస్ కు 14 సీట్లకు పైగానే వస్తాయని ధీమా వ్యక్తం చేశారు.
భారతీయ జనతా పార్టీకి ఒక్క సీటు కంటే ఎక్కువ రాదని, ఇక కాంగ్రెస్ పార్టీకి 2 సీట్లు వస్తాయని, ఎంఐఎంకు ఒక్కటి రావచ్చని తెలిపారు. ఇక ఏపీలో మరోసారి జగన్ మోహన్ రెడ్డి సీఎం కావడం పక్కా అన్నారు. ప్రధాన మంత్రి రేసులో మీరు ఉన్నారా అన్న ప్రశ్నకు అవుననే సమాధానం ఇచ్చారు. ఎందుకు ఉండ కూడదని తిరుగు ప్రశ్న వేశారు. తాను కూడా రేసులో ఉన్నానని చెప్పారు కేసీఆర్.