ఏపీలో జగన్ వచ్చే ఛాన్స్ – కేసీఆర్
జోష్యం చెప్పిన మాజీ సీఎం
హైదరాబాద్ – తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ బాస్ కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన ఏపీలో జరగబోయే శాసన సభ ఎన్నికలకు సంబంధించి సంచలన కామెంట్స్ చేయడం కలకలం రేపింది. మరోసారి ఏపీలో జగన్ మోహన్ రెడ్డి వస్తాడని, ఆయన తిరిగి సీఎంగా కొలువు తీరనున్నాడని జోష్యం చెప్పారు. ఈ విషయాన్ని కేసీఆర్ స్వయంగా ఓ ఛానల్ తో జరిగిన ముఖాముఖి చర్చా కార్యక్రమంలో కుండ బద్దలు కొట్టారు.
ప్రజలు సంక్షేమాన్ని కోరుకుంటారని, అక్కడ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే జగన్ రెడ్డిని గట్టెక్కిస్తాయని పేర్కొన్నారు. ఇక టీడీపీ , జనసేన, బీజేపీ తో కూడిన కూటమికి అంత సీన్ లేదన్నారు. ఈ దేశంలో మోదీ రాజ్యాంగాన్ని తీసుకు రావాలని అనుకున్నాడని కానీ వర్కవుట్ కాదన్నారు.
ప్రజలే చరిత్ర నిర్మాతలని, కానీ వారిని అర్థం చేసుకోకుండా కేవలం కులం, మతం మీద ఆధారపడి రాజకీయాలు చేస్తే ఎళ్లకాలం మనజాలరని సూచించారు కేసీఆర్. ఇక సార్వత్రిక ఎన్నికల్లో తాము సత్తా చాటుతామని, 10 సీట్లకు పైగా వస్తే మరోసారి కేంద్రంలో తాను చక్రం తిప్పడం ఖాయమని చెప్పారు కేసీఆర్.