NEWSTELANGANA

కాంగ్రెస్ స‌ర్కార్ బేకార్ – కేసీఆర్

Share it with your family & friends

నిప్పులు చెరిగిన మాజీ సీఎం

హైద‌రాబాద్ – రాష్ట్రంలో కొత్త‌గా కొలువు తీరిన కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఆశించిన మేర ప‌ని చేయ‌డం లేద‌ని ఆవేద‌న చెందారు మాజీ సీఎం కేసీఆర్. పాల‌న గాడి త‌ప్పింద‌ని, సీఎం రేవంత్ రెడ్డి పూర్తిగా ఫెయిల్ అయ్యాడ‌ని, ప‌రిణ‌తి చెందని నాయ‌కుడిగా ఉండ‌డం వ‌ల్ల‌నే ఇలా జ‌రుగుతోంద‌న్నారు. ఈ స‌ర్కార్ కేవ‌లం కొన్ని రోజులు మాత్ర‌మే ఉంటుంద‌న్నారు.

ప్ర‌భుత్వాన్ని న‌డిపించ‌డంలో వెనుకంజ వేయ‌డం దారుణ‌మ‌న్నారు. ఆరు గ్యారెంటీల పేరుతో ప్ర‌జ‌ల‌ను మోసం చేసిన ఘ‌న‌త రేవంత్ కు ద‌క్కుతుంద‌న్నారు. త‌న‌ను క‌లిసిన బీఎస్పీ చీఫ్ ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ తో భేటీ అనంత‌రం కేసీఆర్ మీడియాతో ముచ్చ‌టించారు.

కాంగ్రెస్ స‌ర్కార్ ఏర్పాటై 100 రోజులు పూర్తి కాక ముందే ప్ర‌జ‌ల నుంచి పూర్తి వ్య‌తిరేక‌త‌ను ఎదుర్కొంటోంద‌ని అన్నారు కేసీఆర్. గెలిచాక ఇచ్చిన హామీల‌ను అమ‌లు చేయ‌లేక రోజుకో మాట మాట్లాడుతోందంటూ మండిప‌డ్డారు. ప్ర‌జ‌లు సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో హ‌స్తాన్ని బండ కేసి కొట్ట‌డం ఖాయ‌మ‌ని జోష్యం చెప్పారు. బీఆర్ఎస్ పెద్ద ఎత్తున దాడి చేస్తోంద‌ని, దీనిని త‌ట్టుకోలేక రేవంత్ డొంక తిరుగుడు ఆన్స‌ర్స్ ఇస్తున్నాడంటూ ఎద్దేవా చేశారు కేసీఆర్.