కేసీఆర్ క్రేజ్ సూపర్
జర్నలిస్ట్ నబీలా జమాల్
హైదరాబాద్ – బీఆర్ఎస్ వ్యవస్థాపకుడు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలనంగా మారారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఆయన అందరికంటే ముందంజలో కొనసాగుతున్నారు. ప్రచార పరంగా బస్సు యాత్రకు శ్రీకారం చుట్టారు. కాంగ్రెస్ పార్టీపై, సీఎం ఎనుముల రేవంత్ రెడ్డిపై అనుచిత కామెంట్స్ చేశారని ఆరోపణలు రావడంతో రాష్ట్ర ఎన్నికల సంఘం సీరియస్ అయ్యింది.
తొలిసారిగా కేసీఆర్ ప్రచారంపై వేటు వేసింది. ఈ మేరకు 48 గంటల పాటు నిషేధం విధించింది. దీనిపై కేసీఆర్ సీరియస్ అయ్యారు. తనకంటే ఎక్కువగా అనుచిత వ్యాఖ్యలు చేసిన రేవంత్ రెడ్డి, పీఎం మోదీపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు.
దీన్ని బట్టి చూస్తే కాంగ్రెస్ , బీజేపీ లోపాయికారి ఒప్పందం చేసుకున్నాయన్న అనుమానం కలుగుతోందంటూ పేర్కొన్నారు. ఇదిలా ఉండగా ప్రముఖ జాతీయ ఛానల్ కు చెందిన జర్నలిస్ట్ నబీలా జమాల్ తో కేసీఆర్ సంభాషించారు. పలు అంశాలపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.
తనపై వ్యక్తిగత కక్షతోనే రేవంత్ రెడ్డి లక్ష్యంగా చేసుకున్నారంటూ ఆరోపించారు. రాజకీయాలలో ప్రత్యక్షంగా యుద్దం చేయాలి కానీ ఇలా పరోక్షంగా ఇబ్బంది పెట్టడం మంచి పద్దతి కాదన్నారు. మొత్తంగా కేసీఆర్ కు అపూర్వమైన రీతిలో ఆదరణ లభిస్తోంది.