ఎన్నికలపై బీఆర్ఎస్ బాస్ ఫోకస్
ఎంపీలతో కీలక సమీక్ష చేపట్టిన బీఆర్ఎస్
హైదరాబాద్ – బీఆర్ఎస్ బాస్, మాజీ సీఎం కేసీఆర్ రాబోయే సార్వత్రిక ఎన్నికలపై ఫోకస్ పెట్టారు. ఎలాగైనా సరే సత్తా చాటాలని నిర్ణయించారు. ఈ మేరకు తనయుడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వరుస సమావేశాలతో హోరెత్తిస్తున్నారు. పార్టీ క్యాడర్ లో జోష్ నింపుతున్నారు. ఏ ఒక్కరు కూడా అధైర్య పడాల్సిన పని లేదని, తన తండ్రి కేసీఆర్ పులి లాంటోడని, ఇక రాష్ట్రంలోని మిగతా నేతలంతా పారి పోవాల్సిందేనని హెచ్చరించారు.
తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు అనుకోకుండా కాంగ్రెస్ ను గెలిపించారని ఇప్పటికే పేర్కొన్నారు. ఇదిలా ఉండగా తాజాగా తన ఫామ్ హౌస్ లో కీలక సమావేశం ఏర్పాటు చేశారు పార్టీ బాస్ కేసీఆర్. ఈ సందర్బంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎలాగైనా సరే సత్తా చాటాలని, దట్టించిన ఉత్సాహంతో పార్టీని ముందుకు తీసుకు వెళ్లాలని పిలుపునిచ్చారు.
ఇదే సమయంలో బీఆర్ఎస్ కు, కాంగ్రెస్ పార్టీకి మధ్య కేవలం ఒక శాతం మాత్రమే ఓట్ల తేడాతో పరాజయం దక్కిందన్నారు. ఈసారి అలా జరగడానికి వీలు లేదన్నారు. మొత్తం 17 ఎంపీ స్థానాలలో బీఆర్ఎస్ జయ కేతనం ఎగుర వేయాలని స్పష్టం చేశారు సీఎం.