స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన కేసీఆర్
హైదరాబాద్ – భారత రాష్ట్ర సమితి పార్టీ బాస్ , మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన కామెంట్స్ చేశారు. తమ పార్టీని వదిలేసి కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలో చేరిన వారి గురించి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పార్టీకి ఎలాంటి ఢోకా లేదన్నారు. కేవలం పదవుల కోసం వెళ్లే వారిని ప్రజలు దగ్గరికి రానివ్వరని అన్నారు.
బీఆర్ఎస్ పార్టీని విడిచి వెళ్లిన వారిని తిరిగి పార్టీలోకి రానిచ్చే ప్రసక్తి లేదని హెచ్చరించారు కేసీఆర్. కాళ్ల మీద పడ్డా కనికరించనని స్పష్టం చేశారు బీఆర్ఎస్ బాస్. ఒక ఎంపీనో లేదా ఒక ఎమ్మెల్యేనో పోవడం వల్ల పార్టీకి వచ్చే నష్టం ఏమీ లేదన్నారు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరు మనోళ్లో ఎవరు పరాయి వాళ్లో తెలిసి పోయిందన్నారు.
పార్టీలో యువ నాయకత్వం రావాలని పిలుపునిచ్చారు. వారికి ప్రయారిటీ ఇవ్వడం జరుగుతుందన్నారు కేసీఆర్. పార్టీని తిరిగి పునర్ నిర్మిస్తామని, తెలంగాణ ఉద్యమాన్ని సక్సెస్ చేసిన తాను , ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించడం తనకు పవర్ లోకి రావడం ఖాయమన్నారు కేసీఆర్. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 100 సీట్లు గెలుస్తామని జోష్యం చెప్పారు మాజీ సీఎం.