ఊపిరి ఉన్నంత దాకా తెలంగాణ కోసమే
ప్రకటించిన బీఆర్ఎస్ బాస్ కేసీఆర్
హైదరాబాద్ – బీఆర్ఎస్ బాస్ , మాజీ సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను తీసుకు వచ్చిన తెలంగాణ రాష్ట్రం ఇవాళ 10 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్బంగా హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో ఉత్సవాలు నిర్వహించారు. తెలంగాణ తల్లికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు కేసీఆర్.
అనంతరం జరిగిన సభలో కేసీఆర్ ప్రసంగించారు. తన కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు తాను పోరాడుతూనే ఉంటానని ప్రకటించారు. తన శ్వాస, ధ్యాస మొత్తం తెలంగాణకు అంకితమని చెప్పారు కేసీఆర్.
కొందరు తనపై లేని పోని రీతిలో ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తున్నారని ఇది మంచి పద్దతి కాదన్నారు. ఆనాడు తాను ఒక్కడినే బయలు దేరిన సమయంలో ఏ ఒక్కరు తనకు మద్దతుగా రాలేదన్నారు.
కానీ ఇవాళ కోరుకున్న తెలంగాణ ఏర్పడిన తర్వాత తామే తీసుకు వచ్చినట్లు ఫోజులు కొడుతున్నారంటూ ఎద్దేవా చేశారు. తాను తెచ్చిన రాష్ట్ర పదవిని అనుభవిస్తున్న వాళ్లకు తనను విమర్శించే నైతిక హక్కు లేదన్నారు కేసీఆర్.