Sunday, April 6, 2025
HomeNEWSమ‌హిళ‌ల‌కు 53 సీట్లు రిజ‌ర్వ్ చేస్తాం

మ‌హిళ‌ల‌కు 53 సీట్లు రిజ‌ర్వ్ చేస్తాం

మాజీ సీఎం కేసీఆర్ సంచ‌ల‌నం

హైద‌రాబాద్ – మాజీ సీఎం కేసీఆర్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. మ‌హిళ‌ల‌కు గుడ్ న్యూస్ చెప్పారు. 53 శాతం సీట్లు రిజ‌ర్వ్ చేస్తామ‌ని చెప్పారు. సీట్ల పున‌ర్విభ‌జ‌న ద్వారా 160 సీట్ల‌కు పెంచుతామ‌న్నారు. కొత్త మహిళా అధ్య‌క్షురాలిని త్వ‌ర‌లో నియ‌మించ‌డం జ‌రుగుతుంద‌న్నారు. భ‌విష్య‌త్తు బీఆర్ఎస్ దేన‌ని అన్నారు. సంక్షేమ పథకాల కారణంగా ప్రజలు కాంగ్రెస్‌కు ఓటు వేశారని, కానీ అది పూర్తిగా విఫలమైందన్నారు. ఏప్రిల్ 27న హరీష్ రావు ఇన్‌చార్జ్‌గా సమావేశం జ‌రుగుతుంద‌న్నారు. పార్టీ నేత‌ల‌కు శిక్ష‌ణా స‌మావేశాలు త్వ‌ర‌లో జ‌రుగుతాయ‌ని ప్ర‌క‌టించారు.

తెలంగాణ భ‌వ‌న్ లో జ‌రిగిన పార్టీ ముఖ్య స‌మావేశంలో పాల్గొని ప్ర‌సంగించారు కేసీఆర్. 25వ వార్షికోత్సవం (సిల్వర్ జూబ్లీ) కోసం ఘనంగా వేడుకలు నిర్వ‌హిస్తామ‌న్నారు. పార్టీలో ప్రధాన మార్పులు జరగనున్నాయని తెలిపారు.

తెలంగాణ జాగృతి దాని సభ్యులు నిర్ణయించిన విధంగా దాని కార్యకలాపాలను కొనసాగిస్తుందని స్ప‌ష్టం చేశారు. BRS దాని లౌకిక భావజాలానికి కట్టుబడి ఉన్న లౌకిక పార్టీగా మిగిలి పోయిందన్నారు కేసీఆర్. ఏడాది పొడ‌వునా ప్ర‌జ‌ల కోసం ఆందోళ‌న‌లు చేప‌ట్టాల‌ని పిలుపునిచ్చారు. రైతులు, కార్మికులు, మహిళలు, విద్యార్థుల కోసం ప్రతి జిల్లాలో మూడు కమిటీలు ఏర్పాటు చేస్తామ‌న్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments