రూ. 10 లక్షలు చెక్కు అందించిన కేసీఆర్
హైదరాబాద్ – కేసీఆర్ సందేశ్ పేరుతో సోషల్ మీడియా ద్వారా పార్టీ కార్యకలాపాలను చురుకుగా నిర్వహిస్తున్నారు ఖమ్మం జిల్లాకు చెందిన బీఆర్ఎస్ నేత డోకుపర్తి సుబ్బారావు. ఇటీవల ఆయన తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు.
తన భార్యతో కలిసి సుబ్బారావు ఫామ్ హౌస్ లో ఉన్న పార్టీ బాస్ కేసీఆర్ ను కలిశారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి వాకబు చేశారు. అనంతరం పార్టీ తరపున రూ. 10 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించారు. చెక్కును ఇవ్వడంతో కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు డోకుపర్తి సుబ్బారావు.
గత కొంత కాలం నుంచి పార్టీ కోసం అహర్నిశలు కృషి చేస్తూ వచ్చారు. ఈ సందర్బంగా కేసీఆర్ మాట్లాడుతూ ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. తన ఆరోగ్యం బాగు కోసం పార్టీతో పాటు తాను కూడా ఉన్నానని భరోసా కల్పించారు.
ఎంత ఖర్చు అయినా పర్వాలేదు ఆదుకుంటామన్నారు. పార్టీకి చెందిన గులాబీ నేతలు, శ్రేణులకు ఆరోగ్య బీమా సదుపాయం కూడా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఇలాంటి అనారోగ్య కారణాలతో ఇబ్బంది పడుతున్న సమయంలో సాయంగా ఉంటుందని స్పష్టం చేశారు కేసీఆర్.