టచ్ లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు
బీఆర్ఎస్ ప్రెసిడెంట్ కేసీఆర్
హైదరాబాద్ – మేం ఎవరికీ గులాములు కామని స్పష్టం చేశారు బీఆర్ఎస్ బాస్, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్. తమకు నిజమైన యజమానులు ఎవరంటే తెలంగాణలోని నాలుగున్నర కోట్ల ప్రజానీకమని స్పష్టం చేశారు.
ఎన్నికలయ్యాక కీలకమైన మార్పులు చోటు చేసుకోవడం ఖాయమని జోష్యం చెప్పారు. బీజేపీకి ఈసారి ఆశించిన మేర సీట్లు రావని పేర్కొన్నారు. ఎంత సేపు కులం, మతం పేరుతో రాజకీయాలు చేస్తే పవర్ లోకి రావడం కుదరదని ఎద్దేవా చేశారు.
రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసుకు సంబంధించి తుది తీర్పు రావాల్సి ఉందన్నారు. ఆయన పక్కా జైలుకు వెళ్లడం తప్పదన్నారు కేసీఆర్. 64 సీట్లలో డిపాజిట్ బీజేపీ కోల్పోయిందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు తమ పార్టీతో టచ్ లో ఉన్నారని స్పష్టం చేశారు కేసీఆర్. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు.
తానేమీ అమాయకుడిని కాదన్నారు. ఈ పదేళ్ల కాలంలో మోదీ దేశానికి ఏం చేశారంటూ ప్రశ్నించారు. 75 ఏళ్ల తర్వాత ఈ దేశంలో ఏం వెలగ బట్టారంటూ మండిపడ్డారు. కాంగ్రెస్ హయాంలో బ్రెయిన్ డ్రెయిన్ జరిగితే మోదీ కాలంలో కేపిటల్ బ్రెయిన్ జరుగుతోందని ధ్వజమెత్తారు.