NEWSTELANGANA

ఢిల్లీ స్కామ్ కాదు ట్రాష్

Share it with your family & friends

నిప్పులు చెరిగిన కేసీఆర్

హైద‌రాబాద్ – బీఆర్ఎస్ బాస్ కేసీఆర్ నిప్పులు చెరిగారు. శ‌నివారం మీడియాతో మాట్లాడారు. మీడియా అడిగిన ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం ఇచ్చారు. ఢిల్లీ స్కామ్ పై తీవ్రంగా స్పందించారు. అది స్కామ్ కాద‌ని బ‌క్కాస్ అంటూ కొట్టి పారేశారు. కావాల‌ని త‌న‌పై క‌క్ష క‌ట్టి త‌న కూతురును అరెస్ట్ చేయించారంటూ ఆరోపించారు.

ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ , కూతురు క‌విత క్లీన్ ఇమేజ్ తో బ‌య‌ట‌కు వ‌స్తార‌ని చెప్పారు కేసీఆర్. ఈడీ చేస్తున్న‌వ‌న్నీ ఆరోప‌ణ‌లే త‌ప్పా ఒక్క రూపాయి కూడా ఇప్ప‌టి వ‌ర‌కు నిరూపించ లేక పోయార‌ని అన్నారు.

తాను, కేజ్రీవాల్ మోదీ నియంతృత్వాన్ని ప్ర‌శ్నించామ‌ని, నిల‌దీశామ‌ని, కులం, మ‌తం పేరుతో చేస్తున్న దారుణాల గురించి ప్ర‌శ్నించాన‌ని అందుకే త‌న‌పై క‌క్ష క‌ట్టార‌ని త‌న‌ను ధైర్యంగా ఎదుర్కోలేక త‌న కూతురును టార్గెట్ చేశారంటూ ధ్వ‌జ‌మెత్తారు కేసీఆర్.

మోడీ బిగ్ ప్లాన్ చేశాడ‌ని, త‌న ప్ర‌భుత్వాన్ని ప‌డ‌గొట్టాల‌ని చూశాడ‌ని, దానిని ముందే ప‌సిగ‌ట్టి బీఎల్ సంతోష్ ను అరెస్ట్ చేయాల‌ని ఆదేశించాన‌ని దీనిని త‌ట్టుకోలేక త‌న‌ను దెబ్బ కొట్టార‌ని ఆరోపించారు.