NEWSTELANGANA

భాష రాని బండికి ఎంపీ ఎందుకు

Share it with your family & friends

నిప్పులు చెరిగిన మాజీ సీఎం కేసీఆర్

క‌రీంన‌గ‌ర్ జిల్లా – బీఆర్ఎస్ బాస్ , తెలంగాణ తొలి ముఖ్య‌మంత్రి కేసీఆర్ నిప్పులు చెరిగారు. ఆయ‌న ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా క‌రీంన‌గ‌ర్ జిల్లాలో ప‌ర్య‌టించి ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి ప్ర‌సంగించారు. ఈ సంద‌ర్బంగా పార్టీ త‌ర‌పున బ‌రిలో నిలిచిన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వ‌ర్ కు మ‌ద్ద‌తుగా ప్ర‌చారం చేప‌ట్టారు. భారీ ఎత్తున రోడ్ షో నిర్వ‌హించారు. ఊహించ‌ని రీతిలో జ‌నం అపూర్వ‌మైన రీతిలో స్వాగతం ప‌లికారు కేసీఆర్ కు.

ప్ర‌స్తుతం సిట్టింగ్ ఎంపీగా ఉన్న భార‌తీయ జ‌న‌తా పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి బండి సంజ‌య్ కుమార్ ప‌టేల్ పై తీవ్ర‌మైన కామెంట్స్ చేశారు. బండి సోయి లేనోడంటూ ఎద్దేవా చేశారు. ఆయ‌న‌కు పార్ల‌మెంట్ లో మాట్లాడ‌టం వ‌స్తుందా అని ప్ర‌శ్నించారు.

విచిత్రం ఏమిటంటే హిందీ మాట్లాడుతున్నాడో ..లేక ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నాడో తెలియ‌క జ‌నం ఆందోళ‌న‌కు గుర‌వుతున్నార‌ని పేర్కొన్నారు కేసీఆర్. మ‌న‌కే అర్థంకాక పోతే పార్ల‌మెంట్ లో బండి సంజ‌య్ కుమార్ ప‌టేల్ మాట్లాడితే ఎవ‌రికి అర్థం అవుతుంద‌ని నిల‌దీశారు బీఆర్ఎస్ బాస్.