కడియంకు రాజకీయ సమాధి తప్పదు
నిప్పులు చెరిగిన బీఆర్ఎస్ బాస్ కేసీఆర్
వరంగల్ జిల్లా – భారత రాష్ట్ర సమితి పార్టీ చీఫ్ , తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ సీరియస్ కామెంట్స్ చేశారు. ఆయన మాజీ డిప్యూటీ సీఎం , ప్రస్తుత స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యేగా ఉన్న కడియం శ్రీహరిపై నిప్పులు చెరిగారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బస్సు యాత్ర చేపట్టారు కేసీఆర్. ఈ సందర్బంగా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
కడియంపై కేసీఆర్ కన్నెర్ర చేశారు. తను ఆయనకు ఏం తక్కువ చేశానని ప్రశ్నించారు. అవకాశం ఇచ్చి అందలం ఎక్కిస్తే చివరకు కన్నతల్లి లాంటి పార్టీని నమ్మించి మోసం చేశాడని ఆరోపించారు. ఆయనకు ప్రజలు తగిన రీతిలో బుద్ది చెప్పడం ఖాయమన్నారు. పార్టీకి చేసిన మోసానికి కడియంకు రాజకీయ సమాధి తప్పదని హెచ్చరించారు కేసీఆర్.
ఇంకో 3 నెలల్లో స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గానికి ఉప ఎన్నికల రాక తప్పదని జోష్యం చెప్పారు. మన రాజయ్య ఎమ్మెల్యే కావడం పక్కా అని స్పష్టం చేశారు బీఆర్ఎస్ బాస్.