ఎమ్మెల్యేగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం
స్పీకర్ సమక్షంలో ఎమ్మెల్యేలు హాజరు
హైదరాబాద్ – భారత రాష్ట్ర సమితి పార్టీ బాస్ , మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలనంగా మారారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో ఊహించని రీతిలో జనం ఛీ కొట్టారు. కేవలం 39 సీట్లకే పరిమితం చేశారు గులాబీ పార్టీని. విచిత్రం ఏమిటంటే కేసీఆర్ సైతం ఈసారి ఎన్నికల్లో రెండు నియోజకవర్గాలలో పోటీ చేశారు.
గజ్వేల్ లో గెలిచిన ఆయన ఉన్నట్టుండి బీజేపీ అభ్యర్థి కాటేపల్లి వెంకట రమణా రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. ఆయనే కాదు ప్రస్తుతం సీఎంగా కొలువు తీరిన ఎనుముల రేవంత్ రెడ్డి సైతం పరాజయం పొందడం విస్తు పోయేలా చేసింది.
ఇదిలా ఉండగా సీఎం పదవి కోల్పోవడంతో ఊహించని షాక్ కు గురయ్యారు. ఆ తర్వాత ఎవరికీ చెప్పకుండానే ఫామ్ హౌస్ కు వెళ్లి పోయారు. అనుకోకుండా బాత్రూంలో జారి పడ్డారు. కాలి మడమ బెణకడంతో యశోద ఆస్పత్రిలో శస్త్ర చికిత్స చేశారు.
ప్రస్తుతం కోలుకోవడంతో తన పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు కాంగ్రెస్ లోకి వెళ్లకుండా ఉండేందుకు ప్లాన్ చేశారు. ఈ మేరకు బుధవారం అసెంబ్లీకి చేరుకున్నారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సమక్షంలో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికలకు సిద్దం కానున్నారు.