కాంగ్రెస్ సర్కార్ పై బీఆర్ఎస్ యుద్దం
స్పష్టం చేసిన మాజీ సీఎం కేసీఆర్
హైదరాబాద్ – బీఆర్ఎస్ బాస్ , మాజీ సీఎం కేసీఆర్ సారథ్యంలో రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై యుద్దాన్ని ప్రకటించారు. ఇక నుంచి ఉపేక్షించే ప్రసక్తి లేదని పేర్కొన్నారు. కృష్ణా నదీ జలాలపై తెలంగాణ హక్కులను కాపాడు కోవడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ఆరోపించారు. కేసీఆర్ అధ్యక్షతన తన నివాసంలో కీలక మీటింగ్ జరిగింది.
ఈ సందర్బంగా కీలక వ్యాఖ్యలు చేశారు. రేవంత్ అనాలోచిత వైఖరి కారణంగా కృష్ణా బేసిన్ లోని దక్షిణ తెలంగాణ రైతాంగ సాగు నీటి హక్కులపై గొడ్డలి పెట్టుగా మారిందన్నారు. కేఆర్ఎంబికి సాగర్, శ్రీశైలం సహా కృష్ణా నది మీద ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించిందని ఆరోపించారు.
తెలంగాణ వ్యవసాయ రైతాంగ వ్యతిరేక నిర్ణయాలను తీవ్రంగా ఖండించారు కేసీఆర్. ఈ సమావేశంలో కృష్ణా బేసిన్ పరిధిలోని పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు అందుబాటులో వున్న పార్టీ ప్రముఖులు పాల్గొన్నారు.
ఈ సమావేశం లో బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రులు హరీశ్ రావు, జగదీష్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, మహమూద్ అలీ, సత్యవతి రాథోడ్ పాల్గొన్నారు.