పార్టీ మారనున్న కేఈ..?
వైసీపీలో చేరాలని నిర్ణయం
కర్నూలు జిల్లా – ఏపీలో ఎన్నికల వేళ రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. ఎవరు ఎప్పుడు ఎక్కడ, ఏ పార్టీలోకి జంప్ అవుతున్నారో చెప్పలేని పరిస్థితి నెలకొంది. అధికారంలో ఉన్న వైసీపీ నుంచి కొందరు టీడీపీ కూటమి లో చేరితే అదే టీడీపీ, జనసేన పార్టీల కూటమికి చెందిన పలువురు నేతలు వైసీపీ కండువా కప్పుకుంటున్నారు.
తాజాగా విజయవాడ పశ్చిమ సీటును ఆశించిన జనసేన సీనియర్ నాయకుడు పోతిన మహేష్ సైతం ఆ పార్టీకి గుడ్ బై చెప్పాడు. ఆయన సీఎం జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో చేరుతున్నట్లు ప్రకటించాడు. మరో వైపు రాయలసీమలో కీలకమైన నాయకుడిగా గుర్తింపు పొందారు కర్నూలు జిల్లాకు చెందిన కేఈ ప్రభాకర్. ఆయన టీడీపీలో అత్యంత సీనియర్ నేత.
తెలుగుదేశం పార్టీని కేఈ వీడనున్నట్లు భారీ ఎత్తున ప్రచారం జరిగింది. తన అనుచరులతో కలిసి అధికార వైసీపీలో చేరాలని నిర్ణయం తీసుకున్నారు. కుమారుడు రుద్ర ఒత్తిడి మేరకే ఆ పార్టీ లో చేరేందుకు డిసైడ్ అయినట్లు టాక్.