ఆదేశించిన తెలంగాణ ప్రభుత్వం
హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంచలన ప్రకటన చేసింది. రాష్ట్రంలో జరిగిన కిడ్నీ మార్పిడుల, అమ్మకాలు, దందాపై తీవ్రంగా స్పందించింది. ఈ మేరకు విచారణ చేపట్టాలని నిర్ణయించింది. సీఐడీకి అప్పగిస్తున్నట్లు స్పష్టం చేసింది. గత కొన్నేళ్లుగా జరిగిన కిడ్నీ ఆపరేషన్స్ పై విచారణ జరపాలని ఆదేశించింది.
హైద్రాబాద్ లని అలకనంద ఆస్పత్రిలో కిడ్నా ట్రాన్స్ప్లాంటేషన్ వ్యవహారం వెలుగు చూడడం కలకలం రేపింది. ఇప్పటి దాకా ఎన్ని ఆపరేషన్స్ చేశారనే దానిపై ఆరా తీయనుంది సీఐడీ. రక్త సంబంధీకులనే కిడ్నీ డోనర్‌ను చేశారా? లేదా ఇతరులనా? అన్న కోణంలో విచారణ చేపడుతున్నారు. అంతే కాకుండా ఎన్నేళ్ల నుంచి ఈ వ్యవహారం జరుగుతోందనే దానిపై ఫోకస్ పెట్టారు దర్యాప్తు అధికారులు.
ప్రధానంగా ప్రైవేట్ , ప్రభుత్వ ఆస్పత్రుల్లో జరిగిన కిడ్నీ మార్పిడులపై దర్యాప్తు ప్రారంభించింది. ఈ మొత్తం వ్యవహారం రాష్ట్రమంతటా కలకలం రేపింది. కిడ్నీ మార్పిడుల స్కాం ఎక్కడి దాకా విస్తరించిందనే దానిపై కూడా ఆరా తీస్తున్నారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నరసింహా సీరియస్ అయ్యారు. వెంటనే రంగంలోకి దిగాలని ఆదేశించారు. దీని వెనుక ఎవరు ఉన్నా ఉపేక్షించవద్దని స్పస్టం చేశారు. బాధితులకు న్యాయం చేస్తామని ప్రకటించారు.