ఆంటోనీ తటిల్ తో కీర్తి సురేష్ పెళ్లి
గోవాలో అంగరంగ వైభవోతంగా పెళ్లి
గోవా – తమిళనాడుకు చెందిన బహు భాషా నటి , జాతీయ పురస్కార గ్రహీత కీర్తి సురేష్ అందరినీ విస్తు పోయేలా చేసింది. ఎవరికీ చెప్పకుండానే తన పెళ్లి ఫోటోలను షేర్ చేసింది. ఈ అమ్మడు ఉన్నట్టుండి దుబాయ్ కి చెందిన వ్యాపారి ఆంటోని తటిల్ ను పెళ్లి చేసుకుంది.
వీరిద్దరూ 12 ఏళ్ల పాటు డేటింగ్ లో ఉన్నారు. తను పెళ్లి చేసుకునేంత దాకా ఎవరికీ ఈ విషయం చెప్పలేదు కీర్తి సురేష్. పెళ్లికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి సోషల్ మీడియాలో. వీరిద్దరూ ఇరు కుటుంబాలు, కొందరు బంధు మిత్రులు, స్నేహితుల సమక్షంలో ఒక్కటయ్యారు.
కీర్తి సురేష్, ఆంటోని తటిల్ కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్నారు . ప్రేమను ఆస్వాదిస్తూ చివరకు ఒక్కటి కావాలని నిర్ణయించుకున్నారు. తెలుగు ప్రేక్షకులకు మహానటి సావిత్రి సినిమా ద్వారా పరిచయం అయ్యారు . సర్కార్ వారి పాట మూవీలో మహేష్ బాబుతో నటించారు.
“#ForTheLoveOfNyke” అంటూ కీర్తి సురేష్ స్వయంగా హ్యాష్ ట్యాగ్ ను జత చేర్చింది. తనకు కుక్కలంటే ఇష్టం. నైక్ అనేది తను పెంచుకున్న పెంపుడు శునకానికి పెట్టుకున్న ముద్దు పేరు. వీరి పెళ్లి హిందూ సంప్రదాయాల ప్రకారం జరిగింది. కీర్తి సురేష్ బంగారు, ఆకుపచ్చ చీరలో అందంగా కనిపించింది.