DEVOTIONAL

డీకే శివ‌కుమార్ ఆరోప‌ణ‌లు అబ‌ద్దం

Share it with your family & friends

తోసి పుచ్చిన కేర‌ళ ఆల‌యం

కేర‌ళ – త‌న‌తో పాటు క‌ర్ణాట‌క రాష్ట్ర ముఖ్య‌మంత్రి సిద్ద‌రామ‌య్య‌పై చేత‌బ‌డి ప్ర‌యోగం చేస్తున్నారంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు డిప్యూటీ సీఎం డీకే శివ‌కుమార్. ఆయ‌న కేర‌ళ ఆల‌యంలో ఇదంతా జ‌రుగుతోందంటూ పేర్కొన్నారు. దీనిపై కేర‌ళ సీపీఎం సీరియ‌స్ అయ్యింది. డీకేఎస్ కు పిచ్చి ప‌ట్టింద‌ని ఆరోపించింది.

ఇలాంటి చవ‌క‌బారు వ్యాఖ్య‌లు చేయ‌డం మానుకోవాల‌ని హిత‌వు ప‌లికింది. విచిత్రం ఏమిటంటే ప్ర‌స్తుతం జ‌రుగుతున్న ఎన్నిక‌ల్లో కాంగ్రెస్, సీపీఎం క‌లిసి ఇండియా కూట‌మిలో భాగ‌స్వామిగా ఉన్నాయి. కానీ ఇరు పార్టీల నేత‌ల మ‌ధ్య మాట‌ల యుద్దం కొన‌సాగుతోంది.

ఈ సంద‌ర్బంగా రాజ రాజేశ్‌వ‌రి అమ్మ వారి దేవాల‌యం త‌ర‌పున క‌మిటీ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. డీకే శివ‌కుమార్ చేసిన ఆరోప‌ణ‌ల్లో వాస్త‌వం లేద‌ని పేర్కొంది. ఆల‌య ట్ర‌స్టు మాత్రం ఇలాంటి క్షుద్ర పూజ‌లు చేయ‌డం త‌మ ఆల‌యం ఒప్పుకోద‌ని కుండ బ‌ద్ద‌లు కొట్టింది. ఆరోప‌ణ‌లు చేసే ముందు ఆధారాలు చూపించాల‌ని కోరింది.

బ‌ట్ట కాల్చి మీద వేయ‌డం మానుకోవాల‌ని ఆల‌య ట్ర‌స్టు సూచించింది.