అశ్వనీ దత్ కామెంట్స్ కేతిరెడ్డి సెటైర్
160 సీట్లు వస్తాయని ఎలా తెలుసు
అమరావతి – అనంతపురం జిల్లా ధర్మవరం వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామి రెడ్డి సీరియస్ కామెంట్స్ చేశారు. ఆయన మీడియాతో మాట్లాడారు. సినీ నిర్మాత చలసాని అశ్వనీ దత్ పై నిప్పులు చెరిగారు.
ఏ మాత్రం వాస్తవాలు తెలుసు కోకుండా టీడీపీ కూటమికి 160 సీట్లకు పైగా వస్తాయని ఎలా తెలుస్తుందని ప్రశ్నించారు. ప్రజలు ఇచ్చిన తీర్పును తాము శిరసా వహిస్తామని అన్నారు. దేశంలో ఎక్కడా లేని రీతిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు, కార్యక్రమాలను అమలు చేసిన ఘనత తమ నాయకుడు జగన్ రెడ్డికి దక్కుతుందన్నారు.
విచిత్రం ఏమిటంటే తమళనాడు రాష్ట్రంలో కూడా ఒకనాడు డీఎంకేకు 2 సీట్లు మాత్రమే కట్టబెట్టారని, తాము కూడా ఓటమికి గల కారణాలను విశ్లేషించు కుంటామని అన్నారు కేతిరెడ్డి వెంకట్రామి రెడ్డి. ఏది ఏమైనా తాము ప్రతిపక్ష పార్టీగా ప్రజల తరపున గొంతుక వినిపిస్తామని చెప్పారు.