సత్యకుమార్ కామెంట్స్ కేతిరెడ్డి సీరియస్
వాస్తవాలు తెలుసుకోకుండా ఆరోపణలు ఎలా
అనంతపురం జిల్లా – మాజీ ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామి రెడ్డి నిప్పులు చెరిగారు. తనపై లేనిపోని ఆరోపణలు చేసిన ఏపీ మంత్రి సత్య కుమార్ యాదవ్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ట్విట్టర్ ఎక్స్ వేదికగా స్పందించారు. ఇది ఎంత మాత్రం బాధ్యత కలిగిన పదవిలో ఉన్న మంత్రికి తగదని పేర్కొన్నారు.
ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం, వ్యక్తిగతంగా ఏవో దురుద్దేశాలు లోపట పెట్టుకుని తనపై వ్యక్తిగతంగా విమర్శలు చేయడం సత్య కుమార్ యాదవ్ కు అలవాటుగా మారిందని మండిపడ్డారు. నిన్న జరిగిన సంఘటన ఎందుకు జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేయకుండా నిరాధారమైన ఆరోపణలు చేయడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు మాజీ ఎమ్మెల్యే .
ఇక్కడ జరిగిన దాడి వాస్తవ పరిస్థితి గురించి పూర్తిగా అవగాహన లేకుండా మాట్లాడటం మంచి పద్దతి కాదని సూచించారు. ధర్మవరం ప్రజలకు నువ్వు ఇచ్చిన హామీలు నెరవేర్చ లేక పక్కదారి పట్టించేందుకు నీ గుండాలు దాడికి దిగారంటూ ఆరోపించారు కేతిరెడ్డి వెంకట్రామి రెడ్డి.
దాడిని సమర్థిస్తున్న నువ్వు, ధర్మవరం ప్రజలకు చెప్పిన 10 పేజీల తప్పుడు హామీల కరపత్రాన్ని చదువుకుంటే మంచిదని హితవు పలికారు మాజీ ఎమ్మెల్యే.