ప్రధానంగా కాల్పుల విరమణ, పీఓకే పై ఫోకస్
మే 12న మధ్యాహ్నం 12 గంటలకు హాట్‌లైన్‌లో భారత్, పాక్ డీజీఎంవోల చర్చలు జరుపుతారు. సరిహద్దుల్లో కాల్పుల విరమణ కొనసాగింపు, ఉద్రిక్తతలు తగ్గింపు అంశాలపై చర్చిస్తారు. రేపటి చర్చలు కాల్పుల విరమణకే పరిమితం అవుతాయంటున్న రక్షణశాఖ వర్గాలు. నిన్న సాయంత్రం 5 గంటల నుంచి అమల్లోకి వచ్చిన సీజ్ ఫైర్. కాగా సీజ్ ఫైర్ అమల్లోకి వచ్చిన 3 గంటల్లోనే కాల్పుల విరమణ ఉల్లంఘించింది పాకిస్తాన్.
ఇదిలా ఉండగా ఆదివారం భారత దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఆయన హైలెవల్ మీటింగ్ లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం పూర్తిగా వాడి వేడిగా సాగింది. ప్రధానంగా భారత్ , పాకిస్తాన్ దేశాల మధ్య చోటు చేసుకున్న ఉద్రిక్తతలపై చర్చలు జరిగాయి. ఈ సమావేశానికి కేంద్ర మంత్రులు రాజ్ నాథ్ సింగ్, సుబ్రమణ్యం జై శంకర్ , సీడీఎస్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ , త్రివిధ దళాధిపతులు హాజరయ్యారు.ఈ భేటీ అనంతరం ప్రధాని మోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు.