ట్రంప్ విక్టరీ షాక్ కు గురి చేసింది
ఖలిస్తానీ ఉద్యమ నేత జగ్మీత్ సింగ్
కెనడా – ఖలిస్తానీ నాయకుడు జగ్మీత్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. అమెరికాలో జరిగిన దేశాధ్యక్ష ఎన్నికల్లో ఊహించని విధంగా రిపబ్లికన్ పార్టీకి చెందిన డొనాల్డ్ ట్రంప్ ఘన విజయం సాధించారు. ఆయన గెలుపుపై స్పందించారు జగ్మీత్ సింగ్. తమకు బిగ్ షాక్ తగిలిందన్నారు.
ఇదిలా ఉండగా ఇప్పటికే ట్రంప్ మాట్లాడుతూ ప్రపంచంలో ఎక్కడ తీవ్రవాదం ఉన్నా అణిచి వేస్తానంటూ హెచ్చరించారు. ఆయన కెనడాలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతున్న ఖలిస్తాన్ ఉద్యమం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. వారి ఆట కట్టిస్తానంటూ ప్రకటించాడు.
ఈ తరుణంలో జగ్మీత్ సింగ్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. మరో వైపు ఇండియాపై పదే పదే విషం కక్కుతున్న కెనెడా చీఫ్ ట్రూడో పరిస్థితి అక్కడం ఏం బాగోలేదు. ఆయన కూడా పూర్తి వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. కేవలం ఎన్నికల్లో ప్రయోజనం పొందేందుకు, ఖలిస్తానీ మద్దతుదారుల నుంచి ఓట్లు రాబట్టేందుకు గేమ్ ప్లాన్ చేస్తున్నారనే ఆరోపణలు లేక పోలేదు.
ఇదే సమయంలో ప్రధానమంత్రి మోడీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తమతో పెట్టుకుంటే పుట్టగతులు ఉండవంటూ హెచ్చరించారు. కాగా జగ్మీత్ సింగ్ మాత్రం ట్రంప్ రావడంతో తమకు చాలా కష్టమేనని ఒప్పుకున్నాడు.