గుకేశ్ దొమ్మరాజు..మను బాకర్
ఢిల్లీ – కేంద్ర ప్రభుత్వం ఖేల్ రత్న అవార్డులను ప్రకటించింది. చిన్న వయసులోనే ప్రపంచ చెస్ ఛాంపియన్ గా నిలిచిన గుకేశ్ దొమ్మరాజుతో పాటు ఒలింపిక్స్ షూటింగ్ విజేత మను బాకర్ , హాకీ ప్లేయర్ హర్మన్ ప్రీత్ సింగ్ , పారా అథ్లెట్ ప్రవీణ్ కుమార్ కు ఖేల్ రత్న వరించింది. 32 మందికి అర్జున అవార్డులు, 17 మందికి పారా అథ్లెటిక్స్ అవార్డులు ప్రకటించింది. ఈనెల 17న పురస్కారాలను ప్రధానం చేయనున్నారు.
చెస్ విభాగంలో గుకేశ్ , హాకీ విభాగంలో హర్మన్ ప్రీత్ సింగ్ , షూటింగ్ లో మను బాకర్, అథ్లెటిక్స్ విభాగంలో జ్యోతి యర్రాజి, అన్నూరాణి, బాక్సింగ్ లో నీతూ, సావీటీ, చదరంగంలో వంటికా అగర్వాల్, హాకీలో సలీమా టెటే, అభిషేక్, సంజయ్, జర్మన్ ప్రీత్ సింగ్, సుఖ్ జీత్ సింగ్ ను అవార్డులు వరించాయి.
పారా విలువిద్య విభాగంలో రాకేశ్ కుమార్, అథ్లెటిక్స్ విభాగంలో ప్రీతిపాల్, జీవన్ జీ దీప్తి, అజీత్ సింగ్, సచిన్ పరేరావు ఖిలారీ, ధరంబీర్, ప్రణవ్ సూర్య, సెమా, సిమ్రాన్ , నవదీప్ లకు దక్కగా పారా బ్యాడ్మింటన్ లో నితీశ్ కుమార్, మురుగేశన్, సుమతి శివన్, మనీషా రామ్ దాస్ , పారా జూడో లో కపిల్ పర్మార్, షూటింగ్ లో మోనా అగర్వాల్ , రుబీనాఫ్రాన్సిస్ , ష సురేష్ కుసలే, సరబ్జోత్ సింగ్ , స్క్వాష్ లో అభయ్ సింగ్, స్విమ్మింగ్ లో సజన్ ప్రకాశ్ , అమన్ ఉన్నారు.
అర్జున అవార్డు జీవిత సాఫల్యం కింద సుచాజింగ్ , మురళీకాంత్ రాజారామ్ పేట్కర్, ద్రోచార్య అవార్డు సుభాష్ రాణా, దీపాలి దేశ్ పాండే, సందీప్ పాంగ్వాన్, ఎస్. మురళీధరన్, కొలాకో ఉన్నారు.