శ్రీవారి లడ్డూ వివాదంపై ఖుష్బూ కామెంట్
సంచలన ట్వీట్ చేసిన ప్రముఖ నటి
తమిళనాడు – తమిళ సినీ రంగానికి చెందిన ప్రముఖ నటి, భారతీయ జనతా పార్టీ నాయకురాలు ఖుష్బూ కీలక వ్యాఖ్యలు చేశారు. గత కొంత కాలంగా తిరుపతి లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారంపై జోరుగా దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే సినీ రంగానికి చెందిన కార్తీ, సూర్య స్పందించారు. దీనిపై తమిళ రాజకీయ పార్టీలకు చెందిన నేతలు కూడా సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. ప్రధానంగా ఎన్టీకే పార్టీ చీఫ్ సీమాన్ అయితే ఏకంగా ఏపీ డిప్యూటీ సీఎం , ప్రముఖ నటుడు పవన్ కళ్యాణ్ కు స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చారు.
తమ సినీ రంగానికి చెందిన కార్తీ అన్నదాంట్లో తప్పేముందని ప్రశ్నించారు. అంతే కాదు పవన్ కళ్యాణ్ కొంచెం తగ్గితే మంచిదని, కోపాన్ని కంట్రోల్ చేసుకో అంటూ మండిపడ్డారు. ఈ తరుణంలో ఖుష్బూ తాజాగా ట్వీట్ చేయడం మరింత ఆసక్తిని రేపుతోంది.
‘తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలపడం దారుణం. బాధ్యులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి. ఎవర్ని వదిలిపెట్టకూడదు. బాధ్యులు కచ్చితంగా మూల్యం చెల్లించుకోవాల్సిందే. మీరు చేసిన తప్పు వేంకటేశ్వర స్వామి చూస్తున్నాడు.’ అంటూ నటి ఖుష్బూ ట్వీట్ చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.