సంచలన వ్యాఖ్యలు చేసిన ఉత్తర కొరియా చీఫ్
ఉత్తర కొరియా – ప్రపంచాన్ని శాసించాలని నిత్యం ప్రయత్నం చేస్తున్న అమెరికా దేశానికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు ఉత్తర కొరియా దేశ అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్. సోమవారం ఆయన ట్విట్టర్ ఎక్స్ వేదికగా తీవ్రంగా స్పందించాడు. ప్రస్తుతం ఇజ్రాయెల్ కు మద్దతు ఇవ్వడాన్ని తప్పు పడుతూనే రెచ్చి పోతున్న అమెరికాకు బుద్ది చెప్పాలంటే ఆయుధాలతో యుద్దం చేయలేమని పేర్కొన్నాడు.
మొదటి నుంచీ అమెరికా అన్నా, ఆ దేశానికి చెందిన వారు ఎవరైనా సరే ఉత్తర కొరియా చీఫ్ కిమ్ కు విపరీతమైన కోపం. అయితే బలమైన ఆయుధాలను కలిగిన యుఎస్ఏను మట్టి కరిపించాలంటే, చుక్కలు చూపించాలంటే, దానిని మన పరిధిలోకి తీసుకు రావాలంటే ఒకే ఒక్క మార్గం ఉందన్నారు కిమ్.
అదేమిటంటే అణ్వాయుధాలతోనే అమెరికా బలుపును తగ్గించ గలమని, వేరే దేని ద్వారా దానిని నియంత్రించ లేమంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం ఉత్తర కొరియా చీఫ్ కిమ్ చేసిన ఈ కామెంట్స్ ప్రపంచ వ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి.
ఇదిలా ఉండగా ప్రస్తుతం ఇజ్రాయెల్, ఇరాన్ ల మధ్య యుద్ద వాతావరణం నెలకొంది. ఒకరిపై మరొకరు యుద్దానికి సిద్దమంటూ ప్రకటించారు.