నా కాళ్లు పట్టుకున్నపెద్దిరెడ్డి
మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి
అమరావతి – మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ సీఎం , బీజేపీ సీనియర్ నాయకుడు కిరణ్ కుమార్ రెడ్డి. ఆయన చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. మంత్రికి దమ్ముంటే తన సవాల్ ను స్వీకరించలని అన్నారు.
తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో తిరుపతి పద్మావతి గెస్ట్ హౌస్ లో రాత్రి 11 గంటలప్పుడు డీసీసీ చీఫ్ గా చేయమంటూ తన కాళ్లు పట్టుకున్నాడని ఆరోపించారు. ఇది అబద్దమని చెప్పాలన్నారు. నేను కాణిపాకం, తరిగొండ గుడిలో ప్రమాణం చేసేందుకు సిద్దంగా ఉన్నానని ప్రకటించారు కిరణ్ కుమార్ రెడ్డి.
దమ్ముంటే నా సవాల్ ను స్వీకరించు అంటూ పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డిపై నిప్పులు చెరిగారు. ఎంతో సౌమ్యంగా ఉండే మాజీ సీఎం ఉన్నట్టుండి మంత్రిపై విరుచుకు పడడం , సంచలన ఆరోపణలు చేయడం ప్రతి ఒక్కరిని విస్తు పోయేలా చేసింది.
రాష్ట్రంలో జగన్ పాలన పడకేసిందని, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన చెందారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, ఇక వైసీపీ ఓటమి ఖాయమైందన్నారు. రాష్ట్రంలో బీజేపీ కూటమి గెలుపొందడం పక్కా అని ధీమా వ్యక్తం చేశారు కిరణ్ కుమార్ రెడ్డి.