స్పష్టం చేసిన కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు
న్యూఢిల్లీ – కేంద్ర ఫుడ్ ప్రాసిసింగ్ శాఖ మంత్రి కిరెణ్ రిజిజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాబోయే కాలంలో భారత దేశం ప్రపంచంతో పోటీ పడేలా తాము ఫోకస్ పెడుతున్నామని స్పష్టం చేశారు. ఆయన ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల శాఖ మంత్రిగా అధికారికంగా బాధ్యతలు చేపట్టారు.
మంత్రిత్వ శాఖ కార్యదర్శి, ఇతర సీనియర్ ఆఫీసర్లతో భేటీ అయ్యారు. మొదటి 100 రోజుల పీఎం కోసం బ్లూ ప్రింట్ కూడా సిద్దం చేసి ఉంచామని స్పష్టం చేశారు కిరణ్ రిజిజు. రాబోయే రోజుల్లో మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ నిలవ బోతోందని పేర్కొన్నారు కేంద్ర మంత్రి.
ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు. ఈ దేశంలో ఉన్న వనరులను గుర్తించడం, ప్రత్యేకించి ఆహార శుద్ది పరిశ్రమలకు పెద్ద పీట వేయడంపై ఎక్కువగా దృష్టి సారించామని పేర్కొన్నారు. దీని వల్ల వేలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి దొరుకుతుందని తెలిపారు.
ఈ దేశంలో మానవ వనరులకు ఎలాంటి కొదవ లేదన్నారు. ఇక 143 కోట్ల మంది భారతీయులు తాము సమర్థవంతమైన, సుస్థిరమైన పాలనను కోరుకుంటున్నారని పేర్కొన్నారు కిరణ్ రిజిజు.