రాజకీయ ఎజెండా ఏమీ లేదు
కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు
న్యూఢిల్లీ – కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరెన్ రిజిజు కీలక వ్యాఖ్యలు చేశారు. తమకంటూ రాజకీయ ఎజెండా అనేది లేదని పేర్కొన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కీలక సూచన చేశారని చెప్పారు.
పార్లమెంట్ కు ఎన్నికైన ప్రతి ఒక్క ఎంపీ , తన కుటుంబ సభ్యులతో ప్రధానమంత్రి సంగ్రహాలయాన్ని విధిగా సందర్శించేలా చూడాలని చెప్పారని తెలిపారు. ఆనాటి జవహర్ లాల్ నెహ్రూ నుంచి నేటి ప్రధాని మోడీ వరకు వారి జీవిత విశేషాలు ఉన్నాయని చెప్పారు.
ప్రతి ప్రధాన మంత్రి దేశం కోసం చేసిన కృషిని మొత్తం తెలుసుకునే అవకాశం దీని ద్వారా కలుగుతుందన్నారు కిరెన్ రిజిజు. గతంలో పని చేసిన వారికి నివాళులు అర్పించడం అవసరమని అన్నారు. దీని వల్ల మనం నేర్చుకునేందుకు వీలు కుదురుతుందని తెలిపారు.