అన్ని సీట్లలో బీజేపీ పోటీ
బీజేపీ చీఫ్ జి. కిషన్ రెడ్డి
హైదరాబాద్ – భారతీయ జనతా పార్టీ చీఫ్, కేంద్ర మంత్రి గంగాపురం కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో తాము ఎవరితో , ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవడం లేదన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలోని 17 సీట్లలో బీజేపీ పోటీ చేస్తుందని స్పష్టం చేశారు.
మెజారిటీ సీట్లలో గెలుస్తామని జోష్యం చెప్పారు కిషన్ రెడ్డి. పార్లమెంట్ ఎన్నికల కార్యాచరణ కోసం జాతీయ నాయకులను కలిశామన్నారు. ఈనెల 9న శుక్రవారం ఢిల్లీలో బీజేపీ రాష్ట్ర ఎన్నికల కమిటీ సమావేశం జరుగుతుందన్నారు. పార్లమెంట్ అభ్యర్థుల ఎంపిక ప్రచార కార్యాచరణపై చర్చ ఉంటుందని పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా అభ్యర్థులు ఎవరనేది పార్టీ హై కమాండ్ నిర్ణయం తీసుకుంటుందన్నారు. తమ బాధ్యత కేవలం వారి పేర్లను సిఫారసు చేయడం జరుగుతుందన్నారు. తమకు 17 సీట్లు తప్పకుండా వస్తాయన్నారు. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి అత్యధికంగా ఓటు శాతం వచ్చిందని చెప్పారు జి. కిషన్ రెడ్డి.