కేంద్ర మంత్రి గంగాపురం కిషన్ రెడ్డి ఫైర్
ఢిల్లీ – కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నిప్పులు చెరిగారు. సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆయన గాలి మాటల్ని ఎవరూ నమ్మరన్నారు. తన బెదిరింపులకు తాను భయపడనని అన్నారు. తాను ఒక్క ప్రాజెక్టును అడ్డుకున్నట్లు రుజువు చూపించాలని సవాల్ విసిరారు.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డా లేదా నేనా?.. కేంద్ర ప్రభుత్వాన్ని అడిగి ఎన్నికల హామీలు ఇచ్చారా అని నిలదీశారు. తెలంగాణకు సంబంధించిన అన్ని ప్రాజెక్టుల విషయంలో నేను రాష్ట్రాల సీఎంలతో మాట్లాడుతూ నిధులు తీసుకొస్తున్నానని అన్నారు.
మెట్రో కోసం రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఒక్క పైసా లేదంటూ ఎద్దేవా చేశారు. తన పాలనా వైఫల్యాలను తనపైకి ఎందుకు నెట్టివేస్తున్నారంటూ సీరియస్ అయ్యారు జి. కిషన్ రెడ్డి. ఒక బాధ్యత కలిగిన ముఖ్యమంత్రి పదవిలో ఉన్న తను ఇలా మాట్లాడటం సబబు కాదన్నారు.
కేంద్ర సర్కార్ కు ప్రత్యేకించి తనకు ఎలాంటి కక్ష ఉండదని, తెలుసుకుంటే మంచిదని స్పష్టం చేశారు.