చెలరేగిన సరైన్ తలవంచిన ఢిల్లీ
106 పరుగుల భారీ తేడాతో ఓటమి
విశాఖపట్టణం – సాగర తీరాన పరుగుల వరద పారింది. ఐపీఎల్ 2024లో భాగంగా జరిగిన కీలకమైన లీగ్ మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ దుమ్ము రేపింది. ఢిల్లీ క్యాపిటల్స్ ను 106 పరుగుల తేడాతో ఓడించింది. ఇరు జట్లు ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించాయి. దీంతో అభిమానులు ఫుల్ ఖుష్ అయ్యారు. ఆటను తెగ ఆస్వాదించారు.
భారీ టార్గెట్ ను ఛేదించే క్రమంలో ఢిల్లీ క్యాపిటల్స్ చేతులెత్తేసింది. కెప్టెన్ పంత్ 55 , స్టబ్స్ 54 మాత్రమే రాణించారు. మిగతా వారంతా కోల్ కతా బౌలింగ్ దెబ్బకు ఠారెత్తి పోయారు. పెవిలియన్ బాట పట్టారు. మార్ష్ డకౌట్ కాగా వార్నర్ 18 రన్స్ కే వెనుదిరిగాడు. 33 పరుగులకే ప్రధాన వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో ఉన్న జట్టును గట్టెక్కించే ప్రయత్నం చేశారు పంత్, స్టబ్స్.
కానీ ఫలితం లేక పోయింది. ఈ ఇద్దరు కలిసి 5వ వికెట్ కు 93 రన్స్ చేశారు. ఇదే సమయంలో బరిలోకి దిగిన వరుణ్ చక్రవర్తి తన బౌలింగ్ మాయా జాలంతో పంత్ , పటేల్ ను ఔట్ చేశాడు. మంచి ఊపు మీదున్న స్టబ్స్ భారీ షాట్ కోసం ప్రయత్నం చేసి చిక్కాడు.
అంతకు ముందు బరిలోకి దిగిన కోల్ కతా భారీ స్కోర్ నమోదు చేసింద.ఇ 7 వికెట్లు కోల్పోయి 272 రన్స్ చేసింది. సునీల్ సరైన్ రెచ్చి పోయాడు. 85 పరుగులు చేశాడు. ఆండ్రూ రస్సెల్ 19 బంతుల్లో 41 రన్స్ చేశాడు. రింకూ సింగ్ 8 బంతులు ఎదుర్కొని 26 రన్స్ తో ఆకట్టుకున్నాడు.