ముంబై పరాజయాల పరంపర
కోల్ కతా నైట్ రైడర్స్ బిగ్ షాక్
కోల్ కతా – ఐపీఎల్ 2024లో శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని కోల్ కతా నైట్ రైడర్స్ దర్జాగా ప్లే ఆఫ్స్ కు చేరుకుంది. ఈ సీజన్ లో పేలవమైన ప్రదర్శన చేస్తూ వస్తున్న ముంబై ఇండియన్స్ ఏ కోశాన పోరాటం చేయకుండానే చేతులెత్తేసింది. ఓపెనర్లు బాగానే ఆడినా ఆ తర్వాత కోలకతా నైట్ రైడర్స్ బౌలర్ల ధాటికి చేతెలెత్తేసింది . ప్రధానంగా కోల్ కతా బౌలర్ వరుణ్ చక్రవర్తి మరోసారి తన అద్భుతమైన స్పిన్ మాయజాలంతో తిప్పేశాడు. వికెట్లను కూల్చాడు.
ఈ విజయంతో 17వ సీజన్ లో ప్లే ఆఫ్స్ కు చేరిన తొలి జట్టుగా నిలిచింది కేకేఆర్. ఈడెన్ గార్డెన్ వేదికగా జరిగిన ఈ కీలక పోరులో 18 రన్స్ తేడాతో విజయం సాధించింది. తొలుత వర్షం ఆటంకం కలిగించడంతో అంపైర్లు మ్యాచ్ ను 16 ఓవర్లకు కుదించారు. ముందుగా బ్యాటింగ్ కు దిగిన కోల్ కతా 7 వికెట్లు కోల్పోయి 157 రన్స్ చేసింది.
వెంకటేశ్ అయ్యర్ 21 బాల్స్ ఎదుర్కొని 6 ఫోర్లు 2 సిక్సర్లతో 42 రన్స్ చేస్తే నితీశ్ రాణా 23 బంతులు ఆడి 4 ఫోర్లు 1 సిక్సర్ తో 33 రన్స్ చేశాడు. అనంతరం మైదానంలోకి దిగన ముంబై 16 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 139 పరుగులు మాత్రమే చేసింది.