రసెల్ జోష్ హైదరాబాద్ కు షాక్
ఉత్కంఠ పోరులో కేకేఆర్ విక్టరీ
కోల్ కతా – ఐపీఎల్ లో భాగంగా కోల్ కతా లోని ఈడెన్ గార్డెన్స్ మైదానంలో జరిగిన లీగ్ మ్యాచ్ ఉత్కంఠ భరితంగా సాగింది. కోల్ కతా నైట్ రైడర్స్ , సన్ రైజర్స్ మధ్య నువ్వా నేనా అన్న రీతిలో పోటీ జరిగింది. చివరగా అనుకోని రీతిలో కేకేఆర్ విక్టరీ నమోదు చేసింది. మరో లీగ్ మ్యాచ్ లో పంజాబ్ చేతిలో ఢిల్లీ ఢమాల్ అంది. చాలా కాలం తర్వాత మైదానంలోకి అడుగు పెట్టిన రిషబ్ పంత్ కు ప్రేక్షకుల నుంచి గ్రాండ్ వెల్ కమ్ లభించింది.
ఇది పక్కన పెడితే మ్యాచ్ విషయానికి వస్తే ఆల్ రౌండ్ షోతో అలరించాడు కోల్ కతా టీంకు చెందిన ఆండ్రూ రసెల్. విచిత్రం ఏమిటంటే గెలుపు అంచుల దాకా వచ్చి ఓటమి పాలైంది ఎస్ ఆర్ హెచ్. క్లాసెన్ దుమ్ము రేపాడు. 29 బంతులు ఎదుర్కొని 8 సిక్సర్లతో రెచ్చి పోయాడు. 63 రన్స్ చేశాడు. కానీ ఆట చివరలో పూర్తిగా మారి పోయింది మ్యాచ్ . కేవలంల 4 పరుగుల తేడాతో పరాజయం మూటగట్టుకుంది హైదరాబాద్.
తొలుత కోల్ కతా నిర్ణీత ఓవర్లలో 208 పరుగులు చేసింది. అనంతరం బరిలోకి దిగిన హైదరాబాద్ 7 వికెట్లు కోల్పోయి 204 రన్స్ మాత్రమే చేసింది. మయాంక్ 32, అభిషేక్ శర్మ 32 రన్స్ చేశారు. త్రిపాఠి 20, మార్కరమ్ 18, సమద్ 15, షాబాజ్ 16 రన్స్ చేసి నిరాశ పరిచారు.
అంతకు ముందు బ్యాటింగ్ చేసిన కోల్ కతా ఇన్నింగ్స్ లో రసెల్ దుమ్ము రేపాడు. 25 బంతులు ఎదుర్కొని 7 సిక్సర్లు , 3 బౌండరలీతో 64 రన్స్ చేసి నాటౌట్ గా నిలిచాడు. ఫిలిప్ 3 ఫోర్లు 3 సిక్సర్లతో 53 రన్స్ చేస్తే , రమణ్ దీప్ సింగ్ 35 , రింకూ సింగ్ 23 రన్స్ చేశారు.