కోల్ కతా దెబ్బ హైదరాబాద్ అబ్బా
మిచెల్ సూపర్ ..అయ్యర్ అయ్యారే
గుజరాత్ – ఐపీఎల్ 2024లో శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని కోల్ కతా నైట్ రైడర్స్ తనకు ఎదురే లేదని సత్తా చాటింది. కీలకమైన క్వాలిఫయర్ 1 లీగ్ మ్యాచ్ లో దుమ్ము రేపింది. మ్యాచ్ మొత్తం కేకేఆర్ డామినేటే్ చేసింది. అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్, ఫీల్డింగ్ లలో సూపర్ షో చేసింది. దీంతో నిన్నటి దాకా ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తూ భారీ స్కోర్ లను నమోదు చేస్తూ వచ్చిన సన్ రైజర్స్ కీలక మ్యాచ్ లో చేతులెత్తేసింది. ఒక రకంగా చెప్పాలంటే చాప చుట్టేసింది.
దర్జాగా ఐపీఎల్ ఫైనల్ కు చేరుకుంది కోల్ కతా. కోల్ కతా బౌలర్లలో మిచెల్ హైదరాబాద్ నడ్డి విరిచేస్తే వెంకటేష్ అయ్యర్ 51 రన్స్ తో దుమ్ము రేపాడు. ఇక కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అదుర్స్ అనిపించేలా కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడాడు. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. హైదరాబాద్ నిర్దేశించిన లక్ష్యాన్ని 13,4 ఓవర్లలోనే ఛేదించారు.
ముందుగా బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ నిర్ణిత 20 ఓవర్లలో 159 రన్స్ చేసింది. రాహుల్ త్రిపాటి, క్లాసెన్ లు అద్భుతంగా ఆడడంతో గౌరవ ప్రదమైన స్కోర్ నమోదు చేశారు.