Thursday, April 17, 2025
HomeNEWSANDHRA PRADESHకేఎల్ యూనివ‌ర్శిటీ కేసులో ప‌లువురు అరెస్ట్

కేఎల్ యూనివ‌ర్శిటీ కేసులో ప‌లువురు అరెస్ట్

నాక్ సభ్యుల‌తో స‌మా 10 మంది అదుపులోకి

గుంటూరు జిల్లా కేఎల్ యూనివ‌ర్శిటీ కేసుకు సంబంధించి కీల‌క అప్ డేట్ వ‌చ్చింది. ఈ కేసుకు సంబంధించి సీబీఐ బృందాలు సోదాలు చేప‌ట్టాయి. రేటింగ్ కోసం లంచాలు ఇవ్వ‌చూప‌డం దేశ వ్యాప్తంగా క‌ల‌క‌లం రేపింది. న్యాక్ స‌భ్యుల‌తో స‌హా మొత్తం 10 మందిని అరెస్ట్ చేశారు. కేఎల్ఈఎఫ్ యూనివ‌ర్శిటీ రేటింగ్ కోసం భారీగా ముడుపులు ముట్ట చెప్పారు.

బంగారు నాణేలు, భారీగా న‌గ‌దు, ఖ‌రీదైన ఫోన్స్ , ల్యాప్ టాప్ లు పెద్ద ఎత్తున లంచంగా ఇచ్చారు. న్యాక్ బృందంలో టాప్ యూనివ‌ర్శిటీల‌కు చెందిన ప్రొఫెస‌ర్లు ఉండ‌డం విస్తు పోయేలా చేసింది. ఇంకా ఈ కేసుకు సంబంధించి సీబీఐ బృందాలు సోదాలు చేప‌డుతున్నాయి. మొత్తం దేశంలోని 20 చోట్ల త‌నిఖీలు చేప‌ట్టారు. వారి ప‌రిశీల‌న‌లో విస్తు పోయే వాస్త‌వాలు వెలుగు చూసిన‌ట్లు స‌మాచారం.

కేఎల్ఈఎఫ్ యూనివర్సిటీకి చెందిన జేపీ సారథి వర్మ, కోనేరు రాజా, ఏ.రామకృష్ణతో పాటు NAAC పరిశీలన కమిటీ చైర్మన్ సమరేంద్ర నాథ్ సాహా, పలువురు కమిటీ సభ్యులను అరెస్టు చేసింది కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ సీబీఐ.

RELATED ARTICLES

Most Popular

Recent Comments