SPORTS

క్లాసెన్ క్లాసిక్ ఇన్నింగ్స్

Share it with your family & friends

హైద‌రాబాద్ గెలుపులో కీల‌కం

చెన్నై – ఐపీఎల్ 2024లో భాగంగా జ‌రిగిన ఐపీఎల్ 17వ సీజ‌న్ లో 2వ క్వాలిఫ‌య‌ర్ మ్యాచ్ లో ప్యాట్ క‌మిన్స్ నాయ‌క‌త్వంలోని స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టు అద్భుత‌మైన ఆట తీరుతో ఆక‌ట్టుకుంది. రాజ‌స్థాన్ రాయ‌ల్స్ జ‌ట్టును ఓడించి నేరుగా ఫైన‌ల్ కు చేరింది.

కేర‌ళ స్టార్ సంజూ శాంస‌న్ ముందుగా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. రాజ‌స్థాన్ బౌల‌ర్ల దెబ్బ‌కు ఆదిలోనే ఇబ్బందులు ప‌డింది హైద‌రాబాద్. ఈ స‌మ‌యంలో జ‌ట్టును ప‌రుగులు పెట్టించే ప్ర‌య‌త్నం చేశారు స్టార్ క్రికెట‌ర్లు క్లాసెన్ తో పాటు త్రిపాఠి.

నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 176 ర‌న్స్ చేసింది. హైద‌రాబాద్ జ‌ట్టులో క్లాసెన్ 34 బాల్స్ ఎదుర్కొని 4 సిక్స‌ర్ల‌తో 50 ర‌న్స్ చేశాడు. ఇక రాహుల్ త్రిపాఠి 15 బంతులు మాత్ర‌మే ఎదుర్కొని 37 ర‌న్స్ చేశాడు. ఇందులో 5 ఫోర్లు 2 సిక్స‌ర్లు ఉన్నాయి.

షాబాజ్ అహ్మ‌ద్ 23 ర‌న్స్ ఇచ్చి 3 వికెట్లు కూల్చితే అభిషేక్ శ‌ర్మ 24 ప‌రుగులు ఇచ్చి 2 వికెట్లు తీసింది.. 20 ఓవ‌ర్ల‌లో 7 వికెట్లు కోల్పోయి 139 ప‌రుగుల‌కే ప‌రిమిత‌మైంది.