కొడాలి నాని నామినేషన్ పై రగడ
తప్పుడు సమాచారం ఇచ్చారని ఫిర్యాదు
గుడివాడ – కృష్ణా జిల్లా గుడివాడ శాసన సభ నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి, మాజీ మంత్రి కొడాలి నానికి బిగ్ షాక్ తగిలింది. ఎన్నికల అఫిడవిట్ లో తప్పుడు సమాచారం ఇచ్చారంటూ తెలుగుదేశం పార్టీ ఆరోపించింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ కు సమర్పించిన వివరాలన్నీ తప్పుడు తడకలేనంటూ పేర్కొంది.
శుక్రవారం దీనిపై తీవ్ర స్థాయిలో వివాదం చోటు చేసుకుంది. మున్సిపల్ కార్యాలయాన్ని క్యాంపు కార్యాలయంగా వినియోగించినట్లు ఫిర్యాదులో టీడీపీ నేతలుపేర్కొన్నారు. భవనాన్ని అద్దెకిచ్చినట్లు అధికారులు పేర్కొన్న పత్రాలను దీనికి జత చేశారు.
తప్పుడు సమాచారమిచ్చిన మాజీ మంత్రి కొడాలి నాని నామినేషన్ను తిరస్కరించాలని కోరారు. ఏ ప్రభుత్వ కార్యాలయాన్నీ వినియోగించ లేదని కొడాలి నాని తన అఫిడవిట్లో పేర్కొన్న నేపథ్యంలో ఆధారాలతో తెదేపా ఫిర్యాదు చేసింది.
కాగా దీనిపై రిటర్నింగ్ అధికారి ఇంకా స్పందించ లేదు. ఆయన నామినేషన్ దాఖలు విషయం ఇప్పుడు గుడివాడలో చర్చనీయాంశంగా మారింది.