నిప్పులు చెరిగిన మాజీ మంత్రి కొడాలి నాని
అమరావతి – మాజీ మంత్రి కొడాలి నాని నిప్పులు చెరిగారు. తన అరెస్ట్ గురించి తీవ్రంగా స్పందించారు. గతంలో తమ ప్రభుత్వం ఉందని అప్పుడు యాక్టివ్ గా మాట్లాడామన్నారు. ఇప్పుడు మేం పవర్ లో లేం. ఇంకేం మాట్లాడతామన్నారు. మూడు కాక పోతే 30 కేసులు పెట్టుకున్నా అభ్యంతరం లేదన్నారు. ఇక అరెస్ట్ ల విషయం చాలా చిన్నదన్నారు. ఇక రెడ్ బుక్ ను తాను చూడలేదన్నారు. అందులో నా పేరు ఉందో కూడా తెలియదన్నారు. కూటమి సర్కార్ వైసీపీ నేతలను టార్గెట్ చేస్తోందన్నారు.
మంగళవారం కొడాలి నాని మీడియాతో మాట్లాడారు. తన లైఫ్ లో భయం అన్న పదానికి తావు లేదన్నారు. రాజకీయాలలో ఇవన్నీ మామూలేనని పేర్కొన్నారు. వెనక్కి తగ్గే ప్రసక్తి లేదన్నారు. పదే పదే రెడ్ బుక్ గురించి ప్రస్తావించడం నారా లోకేష్ బాబుకు అలవాటుగా మారిందన్నారు కొడాలి నాని.
అన్నింటిని ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉన్నామని స్పష్టం చేశారు. తాను ఎక్కడికీ పారి పోలేదన్నారు. ఎవరు ఏమిటనేది జనానికి తెలుసన్నారు. ఎవరో ఏదో చేస్తారని, అదుపులోకి తీసుకుంటారని తాను పారిపోయే మనిషిని కాదన్నారు కొడాలి నాని.