దాడులు చేస్తూ చూస్తూ ఊరుకోం
మాజీ మంత్రి కొడాలి నాని ఫైర్
అమరావతి – మాజీ మంత్రి కొడాలి నాని సీరియస్ అయ్యారు. తమ పార్టీకి చెందిన నేతలు, కార్యకర్తలపై పనిగట్టుకుని టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు దాడులకు దిగడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు. ఆయన మీడియాతో మాట్లాడారు. గెలుపు ఓటములు సహజమని అయినంత మాత్రాన అధికారాన్ని అడ్డం పెట్టుకుని దాడులకు దిగడం దారుణమన్నారు.
దాడులకు పాల్పడితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు కొడాలి నాని. ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ పూర్తయ్యాక టీడీపీ, జనసేన నేతలు కావాలని దాడులకు దిగడంపై మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా దాడుల పరంపర కొనసాగుతోందన్నారు.
వాళ్లు దాడులు చేస్తుంటే భద్రత కల్పించాల్సిన పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారంటూ ధ్వజమెత్తారు కొడాలి నాని. తమ పార్టీ తరపున బాధితులకు భరోసా కల్పిస్తామని చెప్పారు. అంతే కాకుండా దాడులకు పాల్పడడాన్ని నిరసిస్తూ తాము హైకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తామని ప్రకటించారు.