ఎల్లుండి విచారణకు రావాలని ఆదేశం
హైదరాబాద్ – బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. రోటిబండ తండా ఘటనలో ఇప్పటికే హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. షరతులు ఉల్లంఘించారని, తమ అనుమతి తీసుకోకుండానే పట్నంకు నోటీసులు ఇచ్చినట్లు పోలీసులు. ఇందుకు సంబంధించి ఎల్లుండి విచారణకు హాజరు కావాలని పేర్కొన్నారు.
వికారాబాద్ జిల్లా కోడంగల్ నియోజకవర్గానికి చెందిన రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. తాము ఫార్మా సెజ్ కు భూములు ఇచ్చే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు. ఇదే సమయంలో తమ గ్రామానికి విచ్చేసిన జిల్లా కలెక్టర్ ను అడ్డుకున్నారు. దాడి చేసేంత పని చేశారు. కోడంగల్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (కుడా) కమిషనర్ వెంకట్ రెడ్డిని ఉరికించి దాడికి పాల్పడ్డారు.
ఈ మొత్తం ఆందోళన, ఘటనల వెనుక మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ఉన్నారని సీఎం రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పలువురు రైతులను అదుపులోకి తీసుకున్నారు. చిత్రహింసలకు గురి చేశారు. ఇదే సమయంలో జాతీయ మానవ హక్కుల కమిషన్ సీరియస్ అయ్యింది.