Thursday, April 3, 2025
HomeDEVOTIONALశాస్త్రోక్తంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

శాస్త్రోక్తంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

శ్రీ కోదండరామ స్వామి వారి ఆలయం

ఒంటిమిట్ట – ఒంటిమిట్ట ఏకశిలా నగరంలోని శ్రీ కోదండరామ స్వామివా రి ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం ఘనంగా జరిగింది. ఆలయంలో ఏప్రిల్ 6 నుండి 14వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగనున్న విషయం విదితమే. బ్రహ్మోత్సవాల ముందు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వ‌స్తోంది అనాది నుంచి. ఈ సందర్భంగా ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి అర్చన నిర్వహించారు.

గర్భాలయం, శ్రీ ఆంజనేయస్వామి, శ్రీగరుత్మంతుని సన్నిధి, ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేశారు. ఆల‌యంలో ఉదయం 8 నుండి 11.30 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం జరిగింది. ఇందులో భాగంగా అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రజలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు. అనంతరం భక్తులను ఉదయం 11.30 గంటల నుండి సర్వ దర్శనానికి అనుమతించారు.

ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో నటేష్ బాబు, టెంపుల్ ఇన్స్పెక్టర్ న‌వీన్‌, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఉత్స‌వాల‌ను పుర‌స్క‌రించుకుని టీటీడీ జేఈవో వి. వీర‌బ్ర‌హ్మం ఆధ్వ‌ర్యంలో భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments